ప్రత్యేక హోదా సాధనకై కార్యాచరణను ప్రకటించిన వైయస్ జగన్!
- యువత ఉద్యోగాలకు ప్రత్యేక హోదా పర్యాయపదం
- కేంద్రానికి వ్యతిరేకంగా యూనివర్శిటీల్లో నిరసన చేపట్టాలి
- టీడీపీ ఎంపీల చేత చంద్రబాబు రాజీనామా చేయించాలి
ప్రత్యేక హోదా అనేది మన హక్కు అని జగన్ చెప్పారు. పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా పడిన వెంటనే వైసీపీ ఎంపీలంతా రాజీనామాలు చేస్తారని... ఆ తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్ లో నిరవధిక నిరాహారదీక్షను చేపడతారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, యువత భవిష్యత్తు కోసం టీడీపీ ఎంపీల చేత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయించాలని కోరారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పారు.