బెడ్ రూంలో రేగిన మంటలకు మాజీ సైనికాధికారి ఆహుతి!
- భార్యతో కలిసి ఫ్లాట్ లో ఉంటున్న మాజీ సైనికాధికారి
- మల్లికార్జున్ రావుకి సిగిరెట్ తాగే అలవాటు
- సిగిరెట్ పీకల కారణంగా మంటలు వ్యాపించి, సజీవదహనం
నిన్న సాయంత్రం మల్లికార్జున్ రావు బెడ్ రూం నుంచి పొగలు రావడం చూసిన భార్య, ఇరుగు పొరుగులను పిలిచింది. వారొచ్చి డోర్ కొట్టినా తీయకపోవడంతో పగులగొట్టి లోపలికి వెళ్లగా, బెడ్ రూం మొత్తం కాలి బూడిదవ్వగా, మల్లికార్జున్ రావు సజీవ దహనమై కనిపించాడు. దీంతో ఆమె బోరున విలపించింది. మల్లికార్జున్ రావుకు సిగరెట్ అలవాటుందని, సిగరెట్ పీకల కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయని, కుటుంబసభ్యులు, పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.