తండ్రి బతికుంటే అఖిలప్రియ చెంపలు పగులగొట్టేవారు: భూమా సన్నిహితుడు సుబ్బారెడ్డి
- అఖిల ప్రియను వ్యతిరేకిస్తున్న ఏవీ సుబ్బారెడ్డి
- తనను గుంటనక్కగా అభివర్ణించడంపై ఆగ్రహం
- భూమా బతికుంటే ఇలా జరిగేది కాదన్న సుబ్బారెడ్డి
అఖిలప్రియ తనను గుంటనక్కగా సంబోధించిందని గుర్తు చేసిన ఆయన, భూమా బతికుంటే, తనను తూలనాడినందుకు ఆమె చెంపలు వాయించి ఇంట్లో కూర్చోబెట్టి ఉండేవారని అన్నారు. తామిద్దరి మధ్యా ఉన్న అనుబంధం గురించి మాట్లాడిన సుబ్బారెడ్డి, తాను దర్శకుడినైతే, భూమా హీరో అని అభివర్ణించారు. భూమా వర్థంతి సభలో తాను లేకుంటే ఆయన ఆత్మ శాంతించదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు అవకాశం ఇస్తే, తెలుగుదేశం పార్టీ నుంచి తాను ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు.