తెల్లవారుజాము నుంచి వరుస ఎన్ కౌంటర్లు... 8 మంది పాక్ ముష్కరుల హతం

  • సరిహద్దుల్లో ఎన్ కౌంటర్లు
  • సోఫియాన్, అనంతనాగ్ జిల్లాల్లో ఘటనలు
  • కొనసాగుతున్న ఎదురుకాల్పులు
జమ్మూ కాశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతాల్లో ఈ తెల్లవారుజాము నుంచి వరుస ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. సోఫియాన్, అనంతనాగ్ జిల్లాల్లో ఈ ఎన్ కౌంటర్లు జరుగగా, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, సైన్యం ఎదురు కాల్పుల్లో 8 మంది ఉగ్రవాదులు హతులయ్యారు. సోఫియాన్ జిల్లాలోని రెండు ప్రాంతాల్లో ఇంకా ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.

కచ్చాదోరా, ద్రాగాడ్ గ్రామాల్లోకి ఉగ్రవాదులు సాయుధులై చొరబడ్డారన్న సమాచారం అందడంతో, ఈ ప్రాంతాన్ని భారీఎత్తున బలగాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరపడంతో మొత్తం ఏడుగురు మరణించారు. అనంతనాగ్ జిల్లాలోని దైల్ గావ్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక ఉగ్రవాది హతం కాగా, మరొకడు ప్రాణాలతో పట్టుబడ్డట్టు సైన్యాధికారులు వెల్లడించారు.
Go Back to Shorts
Jammu And Kashmir
Anantnag
Sophiyan
Encounter

More Telugu News