జనసేనలో చేరికపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ స్పందన
- జనసేనలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలన్నీ కల్పితాలే
- నా రాజీనామాను మహారాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది
- రాజీనామా ఆమోదం తర్వాత... భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా
స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం వాస్తవమేనని చెప్పారు. అయితే, తన దరఖాస్తును మహారాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని ఆయన తెలిపారు. తన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత... భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. మరోవైపు లక్ష్మినారాయణ గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల మాట్లాడుతూ, ఆయన వస్తే జనసేనలోకి ఆహ్వానిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.