పింకీ లల్వానీతో డేటింగ్ చేస్తున్న విజయ్ మాల్యా... త్వరలోనే పెళ్లి!
Add ap7am to your home Screen

పింకీ లల్వానీతో డేటింగ్ చేస్తున్న విజయ్ మాల్యా... త్వరలోనే పెళ్లి!

  • మూడో పెళ్లికి సిద్ధమైన మాల్యా
  • మాల్యాతోనే ఉంటున్న పింకీ లల్వానీ
  • 2011లో పింకీకి ఉద్యోగం ఇప్పించిన మాల్యా
బ్యాంకులకు వేల కోట్ల అప్పులను ఎగ్గొట్టి లండన్ చెక్కేసిన లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా... అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాదు, ఓ ముద్దుగుమ్మతో లవ్ అఫైర్ నడుపుతున్నాడట. పింకీ లల్వానీ అనే యువతితో డేటింగ్ చేస్తున్నాడని తెలుస్తోంది. 2011లో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లో పింకీకి మాల్యా ఉద్యోగం ఇప్పించారు. ప్రస్తుతం లండన్ లో ఉన్న మాల్యాకు పింకీ తోడుగా ఉంటోందట. ఆయనకు కావాల్సినవన్నీ దగ్గరుండి చూసుకుంటోంది. లండన్ కోర్టు విచారణకు కూడా ఇద్దరూ కలిసే వెళుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారట. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సమాచారం.

తొలుత మాజీ ఎయిర్ హోస్టెస్ సమీరా త్యాబ్జీని విజయ్ మాల్యా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి సంతానమే సిద్ధార్థ్ మాల్యా. ఆ తర్వాత తన చిన్ననాటి స్నేహితురాలు రేఖను పెళ్లాడాడు. వీరిద్దరికీ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు మూడో పెళ్లికి సిద్ధమవుతున్నారు.
vijay mallya
pinky lalwani
affair
marriage

More Telugu News