కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ఐదు పార్టీలు.. సహకరిస్తామన్న టీఆర్ఎస్!
- లోక్ సభలో పాంచ్ పటాకా
- కేంద్రంపై ముప్పేట దాడికి సిద్ధమవుతున్న విపక్షాలు
- అవిశ్వాస తీర్మానాలను నేడు అడ్మిట్ చేసే అవకాశం
మరోవైపు, ఇన్ని రోజులు రిజర్వేషన్లపై పోరాడుతూ, అవిశ్వాసంపై చర్చకు అంతరాయం కలిగించిన టీఆర్ఎస్ పార్టీ సైతం తన వైఖరి మార్చుకుంది. అవిశ్వాసంపై చర్చకు తాము సహకరిస్తామని ఆ పార్టీ ఎంపీలు తెలిపారు. ఇకపోతే కావేరీ బోర్డు గురించి అన్నాడీఎంకే ఎంపీలు యథావిధిగా తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. మరోవైపు, అవిశ్వాసం తీర్మానాలను లోక్ సభలో నేడు అడ్మిట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నారు. రేపు చర్చ జరిగే అవకాశం ఉంది. విపక్షాలకు దీటుగా సమాధానం ఇచ్చేందుకు అధికారపక్షం సిద్ధమైంది.