గ్యాంగ్ రేప్ నిందితులకు ఈ శిక్ష సరిపోతుందా?... మీరే చూసి చెప్పండి!
- యువతిపై అత్యాచారం చేసిన నలుగురు
- భోపాల్ నడి వీధుల్లో తిప్పి అమ్మాయిలతో కొట్టించిన పోలీసులు
- కఠిన శిక్ష పడేలా చూస్తామని వెల్లడి
పోలీసులు చేసిన ఈ పనికి చాలా మందికి ఆనందం కలిగించినా, వారిని బట్టలతో ఎందుకు తిప్పించారని, అర్థనగ్నంగా ఎందుకు తిప్పలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక వారిని రోడ్లపైకి తెచ్చినప్పుడు పలువురు యువతులు వారిని కర్రలు, చెప్పులు తీసుకుని దేహశుద్ధి చేయగా, పనిలో పనిగా కొందరు మహిళా పోలీసులూ వారిని దండించారు. ఇక అత్యాచారం చేసిన కామాంధులకు ఈ శిక్ష సరిపోతుందా?... నెటిజన్ల నుంచి ఎదురైన ఈ ప్రశ్నకు పోలీసు అధికారులు సమాధానం ఇస్తూ, వీరిపై నిర్భయ కేసు పెట్టామని, కఠిన శిక్ష పడేలా చూస్తామని, ఇతర రేపిస్టులకు బుద్ధి రావాలనే ఈ పని చేశామని అంటున్నారు.