సైబీరియా షాపింగ్ మాల్లో ఘోర అగ్ని ప్రమాదం.. 37 మంది సజీవ దహనం
- షాపింగ్‌మాల్ నుంచి చుట్టేసిన అగ్ని కీలలు
- కిటికీల నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకున్న ప్రజలు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
కడపటి సమాచారం అందేసరికి 37 మంది ప్రాణాలు కోల్పోగా 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మరో 70 మంది ఆచూకీ కనిపించడం లేదు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. షాపింగ్ మాల్ నిండా దట్టమైన నల్లని పొగలు కమ్మేయడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మాస్కోకు 3600 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెమెరోవో బొగ్గు ఉత్పత్తికి ప్రసిద్ధి గాంచినది.