టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైన ప్రముఖ సినీ నటుడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైన ప్రముఖ సినీ నటుడు!

  • గౌడ కులానికి కేసీఆర్ చేసిన మేలు చాలా గొప్పది
  • మా జాతికి చేసిన మేలుకు పాదాభివందనం చేస్తున్నా
  • కేసీఆర్ ఆహ్వానిస్తే టీఆర్ఎస్ లో చేరుతా
టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ప్రముఖ సినీ నటుడు సుమన్ మొగ్గు చూపుతున్నారు. భువనగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానిస్తే టీఆర్ఎస్ లో చేరుతానని చెప్పారు. గౌడ కులానికి కేసీఆర్ చేసిన మేలు చాలా గొప్పదని అన్నారు. తమ జాతికి ఆయన చేసిన మేలుకు... ఆయనకు పాదాభివందనం చేస్తున్నామని చెప్పారు.

గౌడ జాతి మొత్తం ఆయనకు అండగా నిలిచి, రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. తన నుంచి కేసీఆర్ ఎలాంటి సహాయం పొందాలనుకున్నా... దానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, ఒరియా సినిమాలు చేస్తున్నానని తెలిపారు. 
suman
KCR
gowda
TRS

More Telugu News