నాగం బాటలో నాగర్‌కర్నూలు బీజేపీ జిల్లా అధ్యక్షుడు.. పార్టీకి గుడ్‌బై
Add ap7am to your home Screen

నాగం బాటలో నాగర్‌కర్నూలు బీజేపీ జిల్లా అధ్యక్షుడు.. పార్టీకి గుడ్‌బై

  • పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి శశిధర్ రెడ్డి రాజీనామా
  • కాంగ్రెస్‌లో చేరనున్న నాగం, శశిధర్?
  • జోరందుకున్న ఊహాగానాలు
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన కాసేపటికే నాగర్ కర్నూలు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిధర్ రెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం లభించడం లేదంటూ గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న నాగం గురువారం సాయంత్రం బీజేపీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు పంపినట్టు పేర్కొన్నారు.

బీజేపీ నుంచి బయటకు వచ్చిన నాగం కాంగ్రెస్‌లో చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసినట్టు వార్తలు వచ్చాయి. పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాకే చెందిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి కీలక పాత్ర పోషిస్తుండడంతో నాగం కూడా కాంగ్రెస్ గూటికే చేరాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శశిధర్ రెడ్డి కూడా నాగం వెంటే నడిచే అవకాశం ఉందని సమాచారం.
BJP
Telangana
Nagar kurnool
Nagam janardhan Reddy

More Telugu News