Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపటి జాతీయ రహదారుల దిగ్బంధానికి టీడీపీ పూర్తి మద్దతు: కళా వెంకట్రావు

  • రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు ఆందోళన చేసినా సహకరిస్తాం
  • విభజన హక్కుల సాధనే మా లక్ష్యం
  • రహదారుల దిగ్బంధానికి టీడీపీ కార్యకర్తలు సంఘీభావం తెలపండి
  • పదో తరగతి పరీక్షలు, అత్యవసర సేవలకు ఇబ్బంది కలిగించకూడదు
ప్రత్యేక హోదా కోసం రేపు ఏపీ ప్రతిపక్ష పార్టీలు తలపెట్టిన జాతీయ రహదారుల దిగ్బంధానికి టీడీపీ పూర్తి మద్దతు ఇస్తోందని ఏపీ మంత్రి కళా వెంకట్రావు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు ఆందోళన చేసినా సహకరిస్తామని తెలిపారు. విభజన హక్కుల సాధనే తమ లక్ష్యమని, రేపటి జాతీయ రహదారుల దిగ్బంధానికి టీడీపీ కార్యకర్తలు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు, అత్యవసర సేవలకు ఇబ్బంది కలిగించకూడదని విజ్ఞప్తి చేశారు. నిరసనలను శాంతియుతంగా తెలియజేయాలని కోరారు.
kala venkatrao
Special Category Status
Telugudesam

More Telugu News