నాగ్ కి హిట్ ఇచ్చిన దర్శకుడే పోటీకొస్తున్నాడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాగ్ కి హిట్ ఇచ్చిన దర్శకుడే పోటీకొస్తున్నాడు

  • వర్మ దర్శకత్వంలో 'ఆఫీసర్' గా నాగ్ 
  • మే 25వ తేదీన విడుదల 
  • అదే రోజున 'నేల టిక్కెట్టు'
నాగార్జున .. రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో 'ఆఫీసర్' సినిమా రూపొందుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. 'శివ'ను మించేదిగా ఈ సినిమా ఉంటుందని వర్మ చెప్పడం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాను సోలోగా రిలీజ్ చేయడం వలన .. ఆశించిన ఫలితాన్ని రాబట్టవచ్చనే ఉద్దేశంతో నాగార్జున వున్నారు. ఈ కారణంగానే ఆయన 'సవ్యసాచి' రిలీజ్ డేట్ ను కూడా వాయిదా వేయించారు.

 'ఆఫీసర్' ను మే 25వ తేదీన రిలీజ్ చేయడానికి నాగార్జున సన్నాహాలు చేయిస్తున్నారు. అయితే అదే రోజున ప్రేక్షకుల ముందుకు రావడానికి రవితేజ రెడీ అవుతున్నాడు. రవితేజ హీరోగా కల్యాణ్ కృష్ణ 'నేల టిక్కెట్టు' సినిమా చేస్తున్నాడు. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను ఆయన తీర్చిదిద్దుతున్నాడు. ఈ సినిమాను మే 25న వదలడానికి ఆయన రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. గతంలో నాగార్జునకి హీరోగా .. నిర్మాతగా 'సోగ్గాడే చిన్ని నాయనా' .. 'రారండోయ్ వేడుక చూద్దాం' వంటి హిట్స్ ఇచ్చిన కల్యాణ్ కృష్ణ, 'నేల టిక్కెట్టు'తో పోటీ ఇస్తుండటం విశేషం.    
nagarjuna
raviteja

More Telugu News