చంద్రబాబుకు ఉన్న సమస్య బీజేపీతో కాదు: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్
- వైసీపీతో మాత్రమే చంద్రబాబుకు సమస్య
- టీడీపీ తీసుకున్న నిర్ణయం దురదృష్టకరం
- ప్రత్యేక హోదా ఇవ్వలేకే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని తెలిపాం
- ఈ విషయంలో బీజేపీని విమర్శించాల్సిన అవసరం లేదు
టీడీపీ తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేకే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని తెలిపామని, ఈ విషయంలో తమ పార్టీపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విమర్శించాల్సిన అవసరం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ మోదీయే ప్రధాని అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.