'నేల టికెట్' కోసం భారీ సెట్ .. ఎక్కువశాతం షూటింగ్ అక్కడే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'నేల టికెట్' కోసం భారీ సెట్ .. ఎక్కువశాతం షూటింగ్ అక్కడే!

  • రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకమైన సెట్ 
  • అక్కడ కీలక సన్నివేశాల చిత్రీకరణ 
  • మే చివరలో విడుదల చేయాలనే ఆలోచన      
ఆ మధ్య తన సినిమాల మధ్య వచ్చిన గ్యాప్ మళ్లీ రిపీట్ కాకూడదనుకున్నాడేమో, రవితేజ వరుస సినిమాలను అంగీకరిస్తూ వెళుతున్నాడు. అలా ప్రస్తుతం ఆయన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'నేల టికెట్' చేస్తున్నాడు. మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే కంటెంట్ తో ఈ సినిమా రూపొందుతోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. భారీగా అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్లో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఏప్రిల్ చివరినాటికి ఈ సినిమా షూటింగును పూర్తిచేసి, మే చివరలో విడుదల చేయనున్నారు. మాళవిక శర్మ నటిస్తోన్న ఈ సినిమా నుంచి, రేపు ఫస్టులుక్ విడుదల కానుంది.       
raviteja
malavika sharma

More Telugu News