టీఆర్ఎస్ లోకి వస్తే కోట్ల రూపాయలు ఇస్తామన్నారు : కాంగ్రెస్ నేత సంపత్ ఆరోపణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీఆర్ఎస్ లోకి వస్తే కోట్ల రూపాయలు ఇస్తామన్నారు : కాంగ్రెస్ నేత సంపత్ ఆరోపణ

  • పార్టీ మారనందుకే నన్ను ఇబ్బంది పెడుతున్నారు
  •  కేసీఆర్ కు దళితులు, రెడ్లు, బీసీలంటే నచ్చదు
  • ఎమ్మెల్యేగా చివరిసారి మాట్లాడుతున్నానంటూ సంపత్ భావోద్వేగం
టీఆర్ఎస్ లోకి వస్తే తనకు కోట్ల రూపాయలు ఇస్తామని ఆశ చూపారని, పార్టీ మారనందుకే తనను ఇబ్బంది పెడుతున్నారంటూ కాంగ్రెస్ నేత సంపత్ ఆరోపించారు. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరిట కోమటిరెడ్డి, సంపత్ చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష ఈరోజు ముగిసింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, గీతారెడ్డి వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ భావోద్వేగం చెందారు. ‘ఎమ్మెల్యేగా చివరిసారి మాట్లాడుతున్నా.. ఎప్పటికీ నేను అలంపూర్ ప్రజల గుండెల్లో ఉండిపోతాను. కేసీఆర్ కు దళితులు, రెడ్లు, బీసీలంటే నచ్చదు’ అని విమర్శించారు.
Congress
mla sampath

More Telugu News