అందుకే, బీజేపీ ఓడిపోయింది : టీడీపీ ఎమ్మెల్యే బండారు విమర్శ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందుకే, బీజేపీ ఓడిపోయింది : టీడీపీ ఎమ్మెల్యే బండారు విమర్శ

  • ఏపీకి జరిగిన అన్యాయం పక్క రాష్ట్రాల వారికి అర్థమైంది
  • అందుకే, యూపీ ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైంది
  • ఏపీకి ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేర్చాలి : బండారు డిమాండ్
ఏపీకి జరిగిన అన్యాయం పక్క రాష్ట్రాల వారికి అర్థమైందని, అందుకే, యూపీ ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైందని టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ విమర్శించారు. సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు,  వైసీపీ వ్యవహార శైలి, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం, మీడియాతో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మాట్లాడుతూ, ఏపీకి ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఒక వ్యక్తిని మోసం చేసినా లేదా ఒక రాష్ట్రాన్ని మోసం చేసినా అది మోసం  కిందకే వస్తుందని మోదీపై విరుచుకుపడ్డారు. ఏపీతో తమకు పని లేదని, యూపీ ఉందని బీజేపీ అనుకుందని, ఈరోజున వారి సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయారని విమర్శించారు. ఈ ఓటమి బీజేపీకి ఒక గుణపాఠంలా ఉండాలని, ఇప్పటికైనా బీజేపీలో మార్పు రావాలని, ఏపీకి హోదా అమలు చేయాలని బండారు కోరారు.
Telugudesam
bandaru

More Telugu News