బాలీవుడ్ యాక్షన్ హీరోతో 'మనం' డైరెక్టర్ చిత్రం...!
- అక్షయ్ కుమార్‌తో సినిమాకు స్క్రిప్ట్ సిద్ధం చేసిన విక్రమ్ కె కుమార్
- అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ జూన్‌లోనే షూటింగ్ మొదలు
- గతంలో మాధవన్‌తో బాలీవుడ్‌లో '13బి' సినిమా చేసిన విక్రమ్
దీంతో కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విక్రమ్.. తాజాగా ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అది కూడా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కోసం. ఓ ఆసక్తికరమైన స్క్రిప్ట్‌ను రెడీ చేయమని విక్రమ్‌ను అక్కీ కోరినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఆయనకు ఉన్న మార్కెటింగ్‌ను దృష్టిలో పెట్టుకుని విక్రమ్ ఓ మంచి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్లాన్ ప్రకారం, అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈ చిత్రం జూన్‌లోనే సెట్స్‌పైకి వెళుతుంది. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలకు మరింత సమయం వెయిట్ చేయాల్సిందే. కాగా, ఇదివరకే మాధవన్ హీరోగా విక్రమ్ '13బి' అనే హిందీ చిత్రాన్ని విక్రమ్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.