శ్రీదేవికి, నాకు మధ్య ఎలాంటి 'ఇగో' ప్రోబ్లమ్స్ ఉండేవి కావు: జయసుధ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీదేవికి, నాకు మధ్య ఎలాంటి 'ఇగో' ప్రోబ్లమ్స్ ఉండేవి కావు: జయసుధ

  • శ్రీదేవి .. నేను కలిసి నటించాము 
  • మేమిద్దరం చాలా క్లోజ్ గా ఉండేవాళ్లం 
  • మా మధ్య మంచి సంబంధాలు ఉండేవి
ఒకప్పుడు కథానాయికలుగా జయసుధ .. జయప్రద .. శ్రీదేవి పేర్లు మాత్రమే ఎక్కువగా వినిపించేవి. అగ్రకథానాయికలుగా ముగ్గురూ ఎవరి ప్రత్యేకతను వాళ్లు సంతరించుకుని కనిపించేవారు. సోలో హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఈ కథానాయికలు కలిసి నటించిన సినిమాలు కూడా వున్నాయి. తాజాగా ఐ డ్రీమ్స్ తో జయసుధ మాట్లాడుతూ శ్రీదేవి గురించి ప్రస్తావించారు.

 " శ్రీదేవి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు .. వాళ్ల కుటుంబసభ్యులు కూడా నాకు బాగా తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీదేవి చాలా స్వీట్ పర్సన్. ఇద్దరం కలిసి కొన్ని సినిమాల్లో చేశాము. ఆమెకి, నాకు మధ్య ఎలాంటి 'ఇగో' ప్రోబ్లమ్స్ ఉండేవి కావు. చాలా మంది చిన్న విషయాలను పెద్దవి చేసి చెబుతుంటారు. అలాంటివాళ్ల మాటలు మనసులో పెట్టుకుని నేను ఎవరినీ దూరం చేసుకోను. ఒకవేళ ఏదైనా అడగాలనుకుంటే నేరుగా అడిగేస్తానే కానీ .. మాట్లాడటం మానేయను. శ్రీదేవికి ..నాకు మధ్య మంచి సంబంధాలు వున్నాయి" అంటూ చెప్పుకొచ్చారు.        
jayasudha
sridevi

More Telugu News