తమిళనాడులో హిజ్రాకి ప్రభుత్వోద్యోగం..!దేశంలోనే ప్రప్రథమం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమిళనాడులో హిజ్రాకి ప్రభుత్వోద్యోగం..!దేశంలోనే ప్రప్రథమం

  • ప్రభుత్వ ఫిజియోథెరపిస్టుగా నియామకం
  • ఓ హిజ్రా ఈ పోస్టును దక్కించుకోవడం దేశంలోనే ప్రప్రథమం
  • మధురై కలెక్టర్ చొరవతో ఉద్యోగం దక్కించుకున్న వైనం
దేశంలోనే తొలిసారిగా ఓ హిజ్రా ప్రభుత్వ ఫిజియోథెరపిస్టుగా ఉద్యోగం పొందారు. తద్వారా తొలిసారిగా ఈ ఉద్యోగం సాధించిన హిజ్రాగా రికార్కులకెక్కారు. ఆ హిజ్రా పేరు సోలు. తమిళనాడులోని విరుదునగర్ జిల్లా, సాత్తూర్ సమీపంలోని ఓ కుగ్రామంలో జన్మించారు. సోలు తన హైస్కూలు చదువు పూర్తికాగానే కోయంబత్తూర్ వెళ్లి అక్కడ నాలుగున్నరేళ్ల పాటు ఫిజియోథెరపీ కోర్సు చేశారు. మధురై జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఫిజియోథెరపిస్టు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో సోలుకు పలు ఇబ్బందులు, ఆటంకాలు ఎదురయ్యాయి. అయినా సరే...పట్టువిడవకుండా మధురై జిల్లా కలెక్టరు వీరరాఘవరావును ఆశ్రయించారు. ఎట్టకేలకు ఫిజియోథెరపిస్టు ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. సోలు రోగులకు తనదైన శైలిలో సేవలు చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.
Hijra
Tamilnadu
Madhurai
Government job

More Telugu News