వర్మపై శ్రీదేవి మరణం ప్రభావం... వైజాగ్ లో స్త్రీ స్వేచ్ఛా సమావేశం వాయిదా!

మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ రోజూ మహిళా దినోత్సవమేనని తాను నమ్ముతున్నట్టు ఆయన చెప్పారు. ఎందుకంటే ఏ పురుషుడు కూడా తనకంటూ ఓ రోజు కలిగి ఉండేందుకు అర్హత లేదని, పురుష దినోత్సవం అంటూ ఒకటి లేకపోవడం అందుకేనేమోనన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

ఇక తనకు ఎంతో ఇష్టమైన మహిళామణి, నటి శ్రీదేవి దూరమైన షాక్ నుంచి వర్మ ఇంకా బయటపడినట్టు లేరు. విశాఖపట్టణంలో తలపెట్టిన స్త్రీ  స్వేచ్ఛా సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. శ్రీదేవి ఆకస్మిక, విషాద మరణ ప్రభావం తనపై ప్రభావం చూపించడమే కారణంగా పేర్కొన్నారు. సమావేశం ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే తెలియజేస్తానని చెప్పారు.


More Telugu News