లెనిన్, పెరియార్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహాలు ద్వంసం చేస్తారా? ... ఏం చెబుతున్నారు మీరు?: విద్వంసకారులపై ప్రకాష్ రాజ్ నిప్పులు
Add ap7am to your home Screen

లెనిన్, పెరియార్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహాలు ద్వంసం చేస్తారా? ... ఏం చెబుతున్నారు మీరు?: విద్వంసకారులపై ప్రకాష్ రాజ్ నిప్పులు

  • వరుసగా విగ్రహాల ధ్వంసం
  • ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించిన ప్రకాష్ రాజ్
  • మీ ఎజెండా ఇదేనా అని సూటి ప్రశ్న
దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న విగ్రహాల ధ్వంసంపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. తొలుత లెనిన్ విగ్రహాన్ని, ఆపై పెరియార్ విగ్రహాన్ని, తరువాత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని ధ్వసం చేశారని గుర్తు చేసిన ఆయన, విద్వంసకారులను మీ ఎజెండా ఏమిటని ప్రశ్నించారు.

మన చిన్నారులకు మీరు ఏం చెప్పదలచుకున్నారని అడిగిన ఆయన, దయచేసి ఈ విగ్రహాల రాజకీయాన్ని ఆపాలని చేతులెత్తి కోరుతున్నానని అన్నారు. హింసామార్గంలో వెళితే మరింత హింసను చూడాల్సి వుంటుందని, మీ ఎన్నికల మ్యానిఫెస్టో గూండాయిజాన్ని పెంచి పోషించడమా? లేక అభివృద్ధా? అంటూ నిప్పులు చెరిగారు.
Statues
Vandalised
BJP
Prakash Raj
Twitter

More Telugu News