నా సినిమా రిలీజ్ అంటే నాక్కాస్త కంగారే: నిఖిల్

  • నిఖిల్ తాజా చిత్రంగా 'కిరాక్ పార్టీ'
  • స్టూడెంట్ లీడర్ గా నిఖిల్
  • ఈ నెల 16వ తేదీన విడుదల
ఎప్పుడూ చూసినా నిఖిల్ చాలా చలాకీగా కనిపిస్తూ కథలను పరుగులు తీయిస్తుంటాడు. కథలను వెంటవెంటనే సెట్ చేసుకుని చకచకా అవి సెట్స్ పైకి వెళ్లేలా చూసుకోవడం ఆయన ప్రత్యేకత. అలాంటి నిఖిల్ తాజా చిత్రంగా 'కిరాక్ పార్టీ ' రూపొందింది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ .. ఇది తనకి 15వ సినిమా అనీ , ఇందులో స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తానని చెప్పాడు. 'హ్యాపీడేస్' తరువాత పూర్తిస్థాయి కాలేజ్ నేపథ్యంలో తాను చేసిన సినిమా ఇదేనని అన్నాడు. ఇంతవరకూ తాను పోషించిన పాత్రల్లో ఇదే బెస్ట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాడు. ఇది యూత్ కి బాగా నచ్చుతుందనీ .. వాళ్లకి సందేశమిచ్చేలా ఉంటుందని అన్నాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు .. దర్శకుడికి విభేదాలు వచ్చాయనే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం చేశాడు.    
Go Back to Shorts
nikhil
sharan koppisetty

More Telugu News