గాలికి నివాళి అర్పించిన ఏపీ శాసనమండలి
- గాలి ముద్దుకృష్ణమనాయుడుకి శాసనమండలి నివాళి
- ఆయన సేవలను కొనియాడిన ఎమ్మెల్సీలు
- ఫిబ్రవరి 7న తుదిశ్వాస విడిచిన గాలి
ఏపీ శాసనమండలి సమావేశాలు ఈ ఉదయం అమరావతిలో ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే దివంగత నేత, టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడుకి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ, రాష్ట్రానికి ముద్దుకృష్ణమనాయుడు చేసిన సేవలను కొనియాడారు. అనంతరం శాసనమండలి రేపటికి వాయిదా పడింది. ఫిబ్రవరి 7వ తేదీన గాలి కృష్ణమనాయుడు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.