నటనలో నా తప్పుల్ని ఆమె అస్సలు వదిలిపెట్టదు : హీరో అజయ్ దేవగణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నటనలో నా తప్పుల్ని ఆమె అస్సలు వదిలిపెట్టదు : హీరో అజయ్ దేవగణ్

  • ఈ నెల 16న విడుదల కానున్న అజయ్ దేవగణ్ ‘రెయిడ్’
  • నా సినిమాలను విమర్శించేంత ధైర్యం నా భార్యకెక్కడిది!
  • మా అమ్మాయి నైసాకు ధైర్యవెుక్కువ 
  • ఓ ఇంటర్వ్యూలో అజయ్ దేవగణ్
బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, ఇలియానా జంటగా నటించిన ‘రెయిడ్’ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో అజయ్ దేవగణ్ ఆసక్తికర విషయాలు చెప్పాడు. ‘కాజోల్ (భార్య) మీ సినిమాలను విమర్శిస్తారా?’ అని ప్రశ్నించగా .. ‘లేదు.. ఆమెకు అంత ధైర్యం ఎక్కడిది?’ అంటూ అజయ్ నవ్వులు చిందించాడు.

అయితే, తన కుమార్తె నైసా మాత్రం తన నటనలో తప్పులుంటే మాత్రం వదిలిపెట్టదని..ధైర్యంగా, తీవ్రంగా విమర్శిస్తుందని అజయ్ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ధూమపానం అలవాటు గురించి ప్రశ్నించగా, ఈ విషయంలో తనపై తనకు నియంత్రణ ఉందని చెప్పిన అజయ్, ఒక్కసారి ఈ అలవాటైతే దానిని నుంచి పూర్తిగా బయటపడటం కష్టమని చెప్పాడు. 
ajay devgan
iliyana

More Telugu News