బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో పాటు 100 మంది బీజేపీ కార్యకర్తల అరెస్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో పాటు 100 మంది బీజేపీ కార్యకర్తల అరెస్టు

  • మోదీపై కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నం 
  • ప్రగతిభవన్‌ వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు
  • ఎక్కడికక్కడే బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఇటీవ‌ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు మండిపడుతోన్న విషయం తెలిసిందే. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రగతిభవన్‌ను ముట్టడించడానికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన హైదరాబాద్‌ పోలీసులు ప్రగతిభవన్‌ వద్దకు భారీగా చేరుకున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలోని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ కార్యాలయం వద్ద కూడా పోలీసులు మోహరించారు.

ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బద్దం బాల్‌రెడ్డితో పాటు 100 మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
BJP
KCR
Police

More Telugu News