ఎన్నికల్లో పోటీకి రెడీ: నటుడు సుమన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్నికల్లో పోటీకి రెడీ: నటుడు సుమన్

  • కోరుకున్న పాలన సాగిస్తే ఎన్నికల్లో మద్దతు
  • కేసీఆర్, చంద్రబాబులకు సుమన్ ఆఫర్
  • ప్రత్యక్షంగా బరిలోకి దిగేందుకూ సిద్ధమే
  • నిరంతర విద్యుత్ ఘనత కేసీఆర్ దేనన్న సుమన్
ఏపీలోని చంద్రబాబు సర్కారు, తెలంగాణలోని కేసీఆర్ సర్కారు తాను కోరుకున్న విధంగా పాలన సాగిస్తే, వారికి మద్దతు పలుకుతానని, ఎన్నికల్లో అనుకూలంగా ప్రచారం చేయడంతో పాటు ప్రత్యక్షంగా బరిలోకి దిగేందుకూ సిద్ధమని నటుడు సుమన్ వ్యాఖ్యానించాడు. హుజూర్ నగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, వైద్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో మరింత అభివృద్ధి దిశగా పాలకులు కృషి సాగించాలని ఆయన కోరాడు.

దేశంలో మరెక్కడా లేని విధంగా వ్యవసాయానికి నిరంతర విద్యుత్ ను అందిస్తున్న ఘనత ఒక్క కేసీఆర్ కు మాత్రమే దక్కిందని పొగడ్తలు కురిపించాడు. రైతులకు బీమా సౌకర్యాన్ని కల్పించడం అభినందనీయమని, గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉందని చెప్పాడు. దివంగత సీఎం వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పేదల్లో భరోసా నింపిందని సుమన్ వ్యాఖ్యానించాడు.
Suman
Chandrababu
KCR
Elections

More Telugu News