కొనేవారేరి?... దేశ వ్యాప్తంగా యజమానుల కోసం ఎదురుచూస్తున్న 4.4 లక్షల ఇళ్లు!
- హైదరాబాద్ లో ఖాళీగా 28 వేల యూనిట్లు
- ముంబైలో 86 వేల యూనిట్లు ఖాళీ
- ఢిల్లీలో అత్యధికంగా 1.50 లక్షల గృహాలు ఖాళీ
చెన్నైలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని, నిర్మాణం పూర్తి చేసుకున్న ఫ్లాట్లను సైతం సొంతం చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొందని తెలిపింది. కోల్ కతాలో 26 వేల యూనిట్లు మిగిలిపోగా, హైదరాబాద్ లో 28 వేల యూనిట్లు, పుణెలో 36 వేల యూనిట్లు ముంబైలో 86 వేల యూనిట్లు, బెంగళూరులో 70 వేల యూనిట్లు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఈ సంవత్సరం రెండో అర్ధ భాగం నుంచి వీటి కొనుగోలుకు ప్రజలు ప్రయత్నించవచ్చని, అప్పుడు ధరలు క్రమంగా పుంజుకునే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నట్టు తెలిపింది.