Rajinikanth: రజనీ కోసం శ్రీదేవి వారం రోజుల ఉపవాసం..!

  • ఆయన ఆరోగ్యం కుదుటపడాలని సాయిబాబాకి మొక్కు
  • సూపర్ స్టార్ కోలుకునే వరకు ఈ విషయం గోప్యం
  • ఓ అంగ్ల దినపత్రిక కథనం వెల్లడి
అందాల నటి శ్రీదేవి చనిపోయిన తర్వాత ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గతంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్యం పాలైనప్పుడు ఆయన త్వరగా కోలుకోవాలని శ్రీదేవి దేవుడికి మొక్కుకుందని, వారం రోజుల పాటు ఉపవాసం కూడా చేపట్టిందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

 2011లో 'రాణా' సినిమా షూటింగ్ జరుపుకుంటున్నప్పుడు రజనీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆయన్ను సింగపూర్ తరలించారు. ఈ వార్తను తెలుసుకున్న శ్రీదేవి ఎవరికీ తెలియకుండా పూణేలోని ఓ సాయిబాబా గుడికి వెళ్లి ఆయన త్వరగా కోలుకోవాలని మొక్కుకుంది. ఆయన కోలుకునేంత వరకు ఆమె ఈ విషయాన్ని ఎవ్వరికీ తెలియనివ్వలేదట. ఇది తెలుసుకున్న రజనీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు ధన్యవాదాలు చెప్పారట. రజనీకాంత్-శ్రీదేవి దాదాపు 20 సినిమాల్లో కలిసి నటించారు.
Rajinikanth
Rana
Sridevi

More Telugu News