కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు
- తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్
- ఈ రాత్రికి తిరుమల చేరుకోనున్న నారా లోకేశ్
- ఈ రాత్రికి తిరుమలలో బస చేయనున్న సీఎం, ఆయన కుటుంబసభ్యులు
- రేపు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి దర్శనం
- అన్నప్రసాదం ట్రస్టుకు రూ.44 లక్షలు విరాళం ఇవ్వనున్న కుటుంబం
రేపు శనివారం (మార్చి 21) నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులంతా కలిసి రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని, స్వామివారి సేవలో పాల్గొననున్నారు. దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని నారా వారి కుటుంబం తరఫున ప్రతి ఏటా కొనసాగిస్తున్న ఆనవాయతీ ప్రకారం, ఈసారి కూడా శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం అందించనున్నారు. ఒకరోజు అన్నవితరణకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను టీటీడీకి విరాళంగా సమర్పించనున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ రాత్రికి చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు తిరుమలలోనే బస చేసి, రేపు ఉదయం దర్శనానంతరం తిరిగి బయలుదేరనున్నారు.