Ram Charan: ధురంధర్-2 చిత్రానికి రామ్ చరణ్ రివ్యూ

Ram Charan Reviews Dhurandhar 2 Bollywood Movie
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ ది రివెంజ్' చిత్రంపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రశంసల వర్షం కురిపించారు. నిన్న మార్చి 19న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనతో దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో, సినిమా చూసిన అనంతరం చరణ్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ చిత్రం చాలా సహజంగా, ఆద్యంతం ఆకట్టుకునేలా, ప్రభావవంతంగా ఉందని పేర్కొన్నారు.

దర్శకుడు ఆదిత్య ధర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని, భావోద్వేగాలను, భారీతనాన్ని చక్కగా మిళితం చేశారని కొనియాడారు. ప్రధాన పాత్రలో నటించిన రణ్‌వీర్ సింగ్ అత్యద్భుతమైన నటన కనబరిచారని, తన తీవ్రతతో ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేశారని కితాబిచ్చారు. నటులు మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తమ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారని ప్రశంసించారు.

సారా అర్జున్ నటన అద్భుతమని, శాశ్వత్ సచ్‌దేవ్ సంగీతం సినిమా స్థాయిని పెంచిందని వివరించారు. ఇంత మంచి సినిమాను నిర్మించి, భారతీయ సినిమాలో ఒక గొప్ప చిత్రంగా నిలిపినందుకు జియో స్టూడియోస్, జ్యోతి దేశ్‌పాండేలను అభినందించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తానికి రామ్ చరణ్ తన శుభాకాంక్షలు తెలిపారు.
Go Back to Shorts
Ram Charan
Dhurandhar 2
Ranveer Singh
Aditya Dhar
Bollywood Action Thriller
Madhvan
Sanjay Dutt
Arjun Rampal
Sara Arjun
Shashwat Sachdev

More Telugu News