మద్యం తీసుకున్న శ్రీదేవి.. పట్టుతప్పి నీటి టబ్ లో పడి మృతి: ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మద్యం తీసుకున్న శ్రీదేవి.. పట్టుతప్పి నీటి టబ్ లో పడి మృతి: ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి

  • దుబాయ్‌లో మృతి చెందిన సినీనటి శ్రీదేవి
  • ప్రమాదవశాత్తూ మృతి చెందారు
  • బాత్ రూమ్‌లో టబ్‌లో మునిగి చనిపోయారు
దుబాయ్‌లో మృతి చెందిన సినీనటి శ్రీదేవి భౌతిక కాయం ప్రస్తుతం అక్కడి అల్‌ఖుసేనీ పోలీసు శవాగారంలోనే ఉన్న విషయం తెలిసిందే. కాగా, శ్రీదేవి ప్రమాదవశాత్తూ మృతి చెందారని యూఏఈ ఆరోగ్య శాఖ ఒక ప్రకటన చేసింది. ఆమె ప్రమాదవశాత్తు బాత్ రూమ్‌లోని టబ్‌లో మునిగి చనిపోయినట్లు తమ వైద్యులు నిర్ధారించారని చెప్పారు. ఆ సమయంలో ఆమె మద్యం తీసుకుని వున్నారని, దాంతో పట్టు తప్పి నీళ్లలో పడిపోయారని ఫోరెన్సిక్‌ నివేదికలో పేర్కొన్నారు. ఆమె గుండెపోటుతో చనిపోయారని మొదట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఫోరెన్సిక్‌ నివేదికను శ్రీదేవి కుటుంబ సభ్యులకు భారత దౌత్య అధికారులు అందించారు.
Sridevi
dubai

More Telugu News