Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎంత జాగ్రత్తగా ఉండాలనేది ఆ గొడవతో అర్థమైంది: కమెడియన్ వేణు

  • అనుకోకుండా అలా జరిగిపోయింది 
  • వాళ్లు కోరినట్టుగా సారీ చెప్పేశాను 
  • తరువాత స్కిట్ల విషయంలో జాగ్రత్తగా వున్నాను
కొంతకాలం క్రితం 'జబర్దస్త్' వేదికపై వేణు చేసిన ఒక స్కిట్ ఒక వర్గానికి ఆగ్రహాన్ని తెప్పించింది .. దాంతో వాళ్లు ఆయనపై దాడి చేశారు. ఆ విషయానికి సంబంధించి ఐ డ్రీమ్స్ లో ఎదురైన ప్రశ్నకు వేణు సమాధానమిస్తూ .. " నిజానికి నేనే తప్పూ చేయలేదు .. అనుకోకుండా అలా జరిగిపోయిందంతే .. ఒకవేళ నేను తప్పుచేసి వుంటే సారీ చెప్పడానికి వెనుకాడను" అన్నాడు.

 "నేను తప్పు చేయకపోయినా .. కొంతమంది రియాక్టయ్యారు .. వాళ్లు నా నుంచి సారీ కోరుకున్నారు .. చెప్పేశాను. ఈ విధంగా జరగడం వలన ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయం నాకు అర్థమైంది. ఏ స్కిట్ చేసినా ఒకటికి పది సార్లు ఆలోచించుకుని చేయాలనే విషయం స్పష్టమైంది. ఆ రోజున నేను చేసిన స్కిట్ కూడా .. నా  లైఫ్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్. దానిని దృష్టిలో పెట్టుకుని ఆ స్కిట్ చేశాను .. ఫలితంగా నా పై దాడి జరిగింది" అని చెప్పుకొచ్చాడు.
venu

More Telugu News