కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో బాంబులు.. నిర్వీర్యానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం

ఖమ్మం జిల్లా మీదుగా ప్రయాణిస్తోన్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో పోలీసులు బాంబులు గుర్తించారు. దీంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. మధిర రైల్వేస్టేషన్‌లోకి వచ్చిన కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో సాధారణ తనిఖీలు చేస్తోన్న పోలీసులకు ఎస్‌-11 బోగీలోని 53వ సీట వద్ద రెండు డబ్బాల్లో పేలుడు పదార్థాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమయిన అధికారులు ప్రయాణికులను ఖాళీ చేయించి, బాంబుల నిర్వీర్యానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని మధిర రైల్వే స్టేషన్‌కి రప్పిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.   
Go Back to Shorts
rail
bambs
Khammam District

More Telugu News