ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత

  • ఆప్ నేతలు తనపై దాడి చేశారని ఢిల్లీ చీఫ్ సెక్రటరీ ఇటీవల ఫిర్యాదు
  • సీసీ ఫుటేజ్‌ కోసం కేజ్రీవాల్‌ ఇంట్లో సోదాలు
  • భారీగా చేరుకున్న పోలీసులు, ఆప్ కార్యకర్తలు
  • పోలీసులు ఇంతటి శ్ర‌ద్ధ‌ జడ్జి బీహెచ్ లోయ మృతిలో ద‌ర్యాప్తుపై చూపితే బాగుండేది: కేజ్రీవాల్‌
ఇటీవ‌ల‌ ఓ సమావేశానికి హాజరైన తనపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు దాడి చేశారని ఢిల్లీ చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదు సంచ‌ల‌నం రేపుతోన్న విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తోన్న ఢిల్లీ పోలీసులు ఈ రోజు కేజ్రీవాల్ నివాసానికి వెళ్ల‌డంతో అక్క‌డ ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవ‌డానికి సీసీటీవీ ఫుటేజీని కూడా స్వాధీనం చేసుకోవాలని పోలీసులు అనుకున్నారు.

అయితే, ఈ విష‌యం తెలుసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోవ‌డంతో అల‌జ‌డి చెల‌రేగింది. ఈ క్ర‌మంలో పోలీసులకు వ్యతిరేకంగా ఆప్ కార్య‌క‌ర్త‌లు నినాదాలు చేశారు. ఢిల్లీ ప్రభుత్వ అధికార ప్రతినిధి అరుణోదయ ప్రకాశ్ ఈ విష‌యంపై ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సుమారు 60 నుంచి 70 మంది పోలీసులు కేజ్రీవాల్ నివాసానికి వ‌చ్చార‌ని చెప్పారు.

అరవింద్ కేజ్రీవాల్  మాట్లాడుతూ.. ఢిల్లీ పోలీసులు ఈ రోజు తన ఇంట్లో సోదాలు చేయడంలో చూపించినంత శ్ర‌ద్ధ‌ జడ్జి బీహెచ్ లోయ మృతిలో ద‌ర్యాప్తుపై చూపితే బాగుండేద‌ని, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇంట్లోనూ సోదాలు చేస్తే పోలీసుల‌ను చూసి దేశ ప్ర‌జ‌లు గర్వించేవార‌ని వ్యాఖ్యానించారు.    
New Delhi
Arvind Kejriwal
agitation

More Telugu News