జియో, ఎయిర్టెల్ తరహాలో ఐడియా సరికొత్త క్యాష్‌బ్యాక్ ఆఫర్!
- 4జీ స్మార్ట్ ఫోన్లు కొన్నవారికి రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్
- 18 నెలల పాటు ప్రతినెలా రూ.199 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలి
- మొదటి దఫాగా రూ.750, రెండో దఫాగా రూ.1,250 క్యాష్ బ్యాక్ లభిస్తుంది
ప్రతినెలా రూ.199 ప్లాన్ తో రీఛార్జ్ చేసుకునే యూజర్లు రెండు వేల రూపాయల వరకు ప్రయోజనాలను పొందనున్నారు. ఈ ఆఫర్లో వినియోగదారులు మొదటి 18 నెలల పాటు ప్రతినెలా రూ.199 లేదా అంతకన్నా ఎక్కువ రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. రీఛార్జి విలువ రూ.3 వేలు పూర్తి కాగానే మొదటి దఫాగా రూ.750 క్యాష్‌బ్యాక్ వస్తుంది. మరో 18 నెలల రీచార్జ్ అనంతరం మరో రూ.1,250 క్యాష్‌బ్యాక్ వినియోగదారులకు లభిస్తుంది.