చేతులు కట్టేసి కొడుతూ, హింసిస్తూ.. సెల్ఫీలు తీసుకున్న యువకులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చేతులు కట్టేసి కొడుతూ, హింసిస్తూ.. సెల్ఫీలు తీసుకున్న యువకులు

  • కేర‌ళ‌లో దారుణ ఘ‌ట‌న
  • చోరీల‌కు పాల్ప‌డుతున్నాడ‌ంటూ మానసిక పరిస్థితి సరిగా లేని యువ‌కుడిని చితక్కొట్టిన వైనం
  • దర్యాప్తు చేస్తోన్న పోలీసులు
కేర‌ళ‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. చోరీల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని ఆరోపిస్తూ మానసిక పరిస్థితి సరిగా లేని ఓ యువ‌కుడిని కొంద‌రు క‌ట్టేసి కొట్టారు. అంతేకాదు, అత‌డిని కొడుతుండ‌గా కొంద‌రు యువకులు సెల్ఫీలు దిగారు. అత‌డి చేతులు కట్టేసి కొన్ని గంటల పాటు హింసించారు.

ఈ విష‌యాన్ని గుర్తించిన కొందరు స్థానికులు పోలీసులకు స‌మాచారం ఇవ్వ‌డంతో అక్క‌డ‌కు చేరుకున్న‌ పోలీసులు బాధితుడిని ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా, అత‌డు కొద్దిసేప‌టి‌కే ప్రాణాలు కోల్పోయాడు.

స‌ద‌రు యువ‌కులు కొట్ట‌డంతోనే బాధితుడు మృతి చెందాడా? లేక ఇత‌ర కార‌ణం ఏమైనా ఉందా? అనే విష‌యంపై పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. పోస్ట్‌మార్టమ్‌ అనంతరం నిజాలు తెలిసే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు తెలిపారు.       
selfie
Kerala
youngsters

More Telugu News