అంతర్జాతీయ చైల్డ్ పోర్నోగ్రఫీ రాకెట్ ఆటకట్టించిన సీబీఐ.. ప్రధాన నిందితుడి అరెస్ట్
- నిందితుడు నిఖిల్ వర్మను అరెస్ట్ చేసిన సీబీఐ
- అతడి వాట్సాప్ గ్రూప్లో వివిధ దేశాలకు చెందిన 100 మంది
- ఇప్పటికే 3500 చైల్డ్ పోర్నోగ్రఫీ వెబ్సైట్ల మూసివేత
చిన్నారుల అశ్లీల వీడియోలను వందమంది ఉన్న వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ గ్రూపులో పాకిస్థాన్, అమెరికా, చైనా, శ్రీలంక సహా మరికొన్ని దేశాల వారు సభ్యులుగా ఉన్నారు. ఈ కేసులో నిఖిల్ వర్మతో పాటు నఫీజ్ రేజా, ఢిల్లీకి చెందిన జహీద్, ముంబైకి చెందిన సత్యేంద్ర ఓం ప్రకాశ్ చౌహాన్, నోయిడాకు చెందిన ఆదర్శ్లపై కేసులు నమోదయ్యాయి. చైల్డ్ పోర్నోగ్రఫీపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్రం ఇప్పటికే 3500 వెబ్సైట్లను మూసివేసింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసింది.