ఆ వార్తలో నిజం లేదు .. నెక్స్ట్ ప్రాజెక్టు ఏంటనేది త్వరలో చెబుతా: చైతూ

  • చందూ మొండేటితో 'సవ్యసాచి' 
  • మారుతి దర్శకత్వంలో ఓ సినిమా 
  • నెక్స్ట్ ప్రాజెక్టు గురించిన ప్రకటన త్వరలో
నాగచైతన్య .. రకుల్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుందనీ, గతంలో కృష్ణవంశీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన సౌజన్య ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయం కానుందనే వార్త ఈ రోజు ఉదయం నుంచి హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం చైతూ చేస్తోన్న సినిమాలు పూర్తికాగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు చెప్పుకుంటున్నారు.

ఈ ప్రచారంపై తాజాగా నాగచైతన్య స్పందిస్తూ .. ఇందులో ఎంతమాత్రం నిజం లేదని చెప్పాడు. ప్రస్తుతం తాను 'సవ్యసాచి'తో పాటు మారుతి  దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నానని అన్నాడు. ఈ రెండు సినిమాలు ఆసక్తికరమైన కంటెంట్ తో  మలచబడుతున్నాయని చెప్పాడు. తదుపరి ప్రాజెక్టు ఏమిటనే విషయాన్ని తాను త్వరలోనే ప్రకటిస్తాననీ .. అప్పటివరకూ ఎలాంటి ప్రచారాలు నమ్మొద్దని స్పష్టం చేశాడు. దాంతో రకుల్ మళ్లీ చైతూ జోడీ కట్టనుందనే ప్రచారానికి తెరపడినట్టైంది.        
Go Back to Shorts
chaitu

More Telugu News