'నేల టికెట్' షూటింగులో 50 మంది ఆర్టిస్టులతో రవితేజ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'నేల టికెట్' షూటింగులో 50 మంది ఆర్టిస్టులతో రవితేజ!

  • కల్యాణ్ కృష్ణతో రవితేజ 'నేల టికెట్'
  • హైదరాబాద్ లో షూటింగ్ 
  • ఫ్యామిలీ సీన్స్ చిత్రీకరణ
రవితేజ 'టచ్ చేసి చూడు' ఇలా థియేటర్స్ కి వచ్చి అలా వెళ్లిపోవడంతో ఆయన అభిమానులంతా తీవ్రమైన నిరాశకు లోనయ్యారు. దాంతో తన తదుపరి సినిమాతో హిట్ కొట్టాలనే పట్టుదలతో రవితేజ వున్నాడు. ప్రస్తుతం ఆయన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'నేల టికెట్' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నారు.

ఈ షెడ్యూల్లో ఫ్యామిలీ నేపథ్యంలో సాగే సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారట. ప్రతి రోజు రవితేజతో పాటు 50 మంది ఆర్టిస్టులు షూటింగులో పాల్గొంటున్నట్టుగా చెబుతున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తోన్న ఈ సినిమా, శాటిలైట్ .. డబ్బింగ్ .. డిజిటల్ హక్కుల నిమిత్తం 25 కోట్లు వచ్చినట్టుగా చెబుతున్నారు. మాస్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలోపెట్టుకుని కల్యాణకృష్ణ  దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, రవితేజ సరసన మాళవిక నాయర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.     
raviteja
malavika

More Telugu News