ఎన్టీఆర్ స్థానంలో నాని .. ‘బిగ్ బాస్’ సీజన్ -2 వ్యాఖ్యాతగా నేచురల్ స్టార్?

  • ‘సీజన్ -2 కు వ్యాఖ్యాతగా కుదరదన్న జూనియర్ ఎన్టీఆర్
  • త్రివిక్రమ్ సినిమాతో బిజీ కానున్న యంగ్ టైగర్
  •  వ్యాఖ్యాతగా సహజనటుడు నాని ఎంపిక? 
‘బిగ్ బాస్’ సీజన్ -1కు వ్యాఖ్యాతగా ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించిన విషయం తెలిసిందే. తన హావభావాలతో, డైలాగ్స్ తో ఆ షోను ఎంతో రక్తికట్టించాడు.‘బిగ్ బాస్’ సీజన్ -1కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో, సీజన్ -2 ను ప్రారంభించాలని నిర్వాహకులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, ఈ సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించట్లేదు. త్రివిక్రమ్-ఎన్టీఆర్ దర్శకత్వంలో  ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుండటంతో జూనియర్ ఎన్టీఆర్ బిజీ కానున్నాడు. దీంతో, ‘బిగ్ బాస్’ సీజన్ -2లో చేసేందుకు తనకు కుదరదని ఎన్టీఆర్ చెప్పేశారు.

ఈ నేపథ్యంలో, వ్యాఖ్యాతగా ఎవరిని ఉంచితే బాగుంటుందని నిర్వాహకులు బాగా ఆలోచించిన మీదట ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సహజనటుడు నానిని ఎంచుకున్నట్టు, ప్రస్తుతం అతనితో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. కాగా, ఇటీవల జరిగిన ఐఫా ఉత్సవంలో నటుడు రానాతో కలిసి నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు.  
Go Back to Shorts
Tollywood
hero nani
big boss
season 2

More Telugu News