తాను కించపర్చిన మహిళను క్షమాపణలు కోరిన రామ్‌ గోపాల్‌ వర్మ.. శిక్ష పడాల్సిందేనన్న మణి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తాను కించపర్చిన మహిళను క్షమాపణలు కోరిన రామ్‌ గోపాల్‌ వర్మ.. శిక్ష పడాల్సిందేనన్న మణి

  • ఓ మహిళపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మ
  • ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పశ్చాత్తాపం
  • వర్మ క్షమాపణను ఒప్పుకోనన్న మహిళ
  • శిక్ష పడాల్సిందేనని వ్యాఖ్య
జీఎస్టీ పేరుతో శృంగారమే ప్రధానాంశంగా సినిమా తీసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మ‌ణి అనే ఓ మ‌హిళ‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ రోజు పోలీసు విచార‌ణకు హాజ‌రైన వ‌ర్మ‌.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... ఆమెకు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఆ మ‌ణి అనే ఆవిడ ఎవ‌రో త‌న‌కు నిజంగా తెలియ‌దని అన్నారు.

జీఎస్టీపై మాట్లాడుతూ ఆ స‌మ‌యంలో నేను అలా అనుకోకుండా అని ఉండొచ్చని తెలిపారు. తాను స‌హ‌జంగా హ్యూమ‌ర‌స్ త‌ర‌హాలో మాట్లాడతాన‌ని, తన మాట‌ల వ‌ల్ల మ‌ణికి ఆమె కుటుంబం నుంచి ఏమైనా స‌మ‌స్య వ‌చ్చి ఉంటే సారీ చెబుతున్నాన‌ని అన్నారు. అనుకోకుండా అలా మాట్లాడాన‌ని అన్నారు.

ఈ విష‌యంపై స‌ద‌రు మ‌హిళ‌ మ‌ణి స్పందిస్తూ.. రామ్ గోపాల్ వ‌ర్మ క్ష‌మాప‌ణ‌ల‌ను తాను ఒప్పుకోన‌ని అన్నారు. ఆయ‌న సారీ త‌న‌కు వ‌ద్ద‌ని, వ‌ర్మ‌కి చ‌ట్ట‌ప్ర‌కారం ఎటువంటి శిక్ష ప‌డాలో అటువంటి శిక్ష ప‌డాల‌ని తేల్చిచెప్పారు. తాను సెల‌బ్రిటీన‌ని, ఎవ్వ‌రూ ఏమీ చేయ‌లేర‌ని వ‌ర్మ‌కు పొగ‌రు ఉంద‌ని, ఆయనకు శిక్ష ప‌డాల్సిందేన‌ని చెప్పారు.   
gst
RGV
Police
Hyderabad

More Telugu News