విచారణలో రామ్ గోపాల్ వర్మ చెప్పింది ఇదే!: డీసీపీ
- సినిమాను తాను తీయలేదని చెప్పారు
- కాన్సెప్ట్ మాత్రమే తనదని తెలిపారు
- వాస్తవాలను బయటకు లాగుతాం
నగ్నంగా ఉన్న మాల్కోవాతో వర్మ ఉన్న ఫొటోలను ఆయన ఫోన్, ల్యాప్ టాప్ నుంచి డౌన్ లోడ్ చేసి, ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతామని... ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత... ఈ ఫొటోలన్నీ ఎలా వచ్చాయి? మీరు ఏం తీశారు? ఎందుకు తీశారు? అనే విషయాలను తదుపరి విచారణలో ప్రశ్నిస్తామని డీసీపీ తెలిపారు. సినిమాను ఎక్కడ తీసినా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.
భారతీయ పౌరుడు విదేశాల్లో తప్పు చేసినా, ఇక్కడ శిక్షించవచ్చని తెలిపారు. సినిమా షూటింగ్ లో ఆయన ఇన్వాల్వ్ అయ్యారా? లేదా? అనే విషయాన్ని తేల్చాల్సి ఉందని చెప్పారు. స్కైప్ ద్వారా తాను డైరెక్ట్ చేశానని... ఆ సినిమా అశ్లీల చిత్రం కాదని, ఒక ఆర్ట్ ఫిల్మ్ అని వర్మ చెబుతున్నారని... అయితే, ఆయన చెప్పే విషయాలను తాము పట్టించుకోబోమని డీసీపీ తెలిపారు.