కేసీఆర్ జన్మదిన వేడుకల్లో అగ్నిప్రమాదం.. క్షేమంగా బయటపడ్డ మంత్రి
- మంచిర్యాల జిల్లాలో ప్రమాదం
- కేక్ కట్ చేసిన అనంతరం బాణసంచా కాల్చిన కార్యకర్తలు
- క్షేమంగా బయటపడ్డ మంత్రి జోగు రామన్న
మంచిర్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో మున్నూరు కాపు సామాజిక భవన నిర్మాణానికి జోగు రామన్న భూమి పూజ చేశారు. అనంతరం సభా వేదిక వద్దకు చేరుకుని... కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ బాణసంచా కాల్చారు. ఈ క్రమంలో కొన్ని నిప్పురవ్వలు టెంట్ మీద పడటంతో, అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో టెంట్ పూర్తిగా దగ్ధమయింది. అక్కడ వేసిన కుర్చీలు కూడా కాలిపోయాయి.
