హీరోయిన్లపై మండిపడ్డ శివాజీరాజా!

  • 'మా'కు హీరోయిన్లు సహకరించడం లేదు
  • చెక్ బౌన్స్, రెమ్యునరేష్ ఇబ్బందులప్పుడు మాత్రం మా దగ్గరకు వస్తారు
  • అలాంటివారికి ఇకపై సాయం చేయం
హీరోయిన్లపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు శివాజీరాజా మండిపడ్డారు. 'మా' కోసం సొంత కార్యాలయాన్ని నిర్మించాలని భావిస్తున్నామని... అయితే, దీనికి హీరోయిన్ల నుంచి ఏమాత్రం సహకారం లభించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్ బౌన్స్ వంటి కేసులు ఎదురైనప్పుడు మాత్రమే వారు తమను సంప్రదిస్తారని అన్నారు. ఇకపై తమ కాల్స్ కు హీరోయిన్లు రెస్పాండ్ కాకుంటే... వారికి ఎలాంటి సహాయం చెయ్యబోమని స్పష్టం చేశారు. పారితోషికం ఇబ్బందులను పరిష్కరించుకునేందుకే హీరోయిన్లు 'మా'లో చేరారని వ్యాఖ్యానించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతోందని... ఈ సందర్భంగా పలు ఈవెంట్లను నిర్వహించబోతున్నట్టు శివాజీరాజా తెలిపారు. అమెరికాలో జరగబోయే ఈవెంట్స్ కు చిరంజీవి, మహేష్ బాబులు హాజరవుతారని చెప్పారు. 
Go Back to Shorts
maa
shivajiraja
Tollywood
heroines

More Telugu News