బారులో పీకల దాకా మద్యం తాగి.. ముప్పుతిప్పలు పెట్టిన కోతి.. మీరూ చూడండి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బారులో పీకల దాకా మద్యం తాగి.. ముప్పుతిప్పలు పెట్టిన కోతి.. మీరూ చూడండి!

  • బెంగళూరులోని కమ్మనహళ్లిలోని దివాకర్ బార్‌లో ఘటన
  • ప్ర‌తిరోజు వ‌చ్చి మ‌నుషులు తాగ‌గా మిగిలి వ‌దిలిపోయిన మద్యాన్ని తాగే కోతి
  • తాజాగా ఫుల్లుగా తాగిన వైనం
మ‌నిషి మ‌ద్యం తాగితే కోతిలా ప్ర‌వ‌ర్తిస్తాడ‌ని అంటాం. మ‌రి కోతే మ‌ద్యం తాగితే? 'ఇలా ఉంటుంది'.. అనేలా ఓ కోతి బార్ సిబ్బందిని ముప్పుతిప్ప‌లు పెట్టింది. బెంగళూరులోని కమ్మనహళ్లిలోని దివాకర్ బార్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆ కోతి ఆ బార్ కి బాగా అల‌వాటు ప‌డింది. ప్ర‌తిరోజు వ‌చ్చి మ‌నుషులు తాగ‌గా మిగిలిపోయిన మద్యాన్ని తాగుతుంటుంది. కాగా, తాజాగా ఆ కోతి పీకల‌ దాకా తాగేసింది.

ఆ త‌రువాత ఊరుకుంటుందా?  అక్కడున్న వారి వెంట పడుతూ ప‌రుగులు పెట్టించింది. కొందరు దాన్ని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసి మొద‌ట విఫ‌ల‌మ‌య్యారు. వారిచ్చిన‌ పళ్లు తిన్న కోతి వారికి దొర‌క‌కుండా పారిపోయింది. చివ‌ర‌కు ఒక‌రు దాన్ని ప‌ట్టుకుని అక్క‌డి నుంచి తీసుకెళ్లారు.      
bar
Bangladesh
monkey

More Telugu News