సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • సినిమాలే జీవితం కాదంటున్న ముద్దుగుమ్మ 
  • ఒకరోజు ముందే వస్తున్న మహేశ్ సినిమా 
  • భారీ రేటుకి 'సాక్ష్యం' హిందీ డబ్బింగ్ హక్కులు 
  • వేసవిలో నిహారిక 'హ్యాపీ వెడ్డింగ్'
*  సినిమానే నా జీవితం కాదు.. అంటోంది ప్రెట్టీ డాల్ శ్రుతి హాసన్. "ఈమధ్య సినిమాలు చేయడం లేదు, మానేశారా? అంటూ నన్ను చాలా మంది అడుగుతున్నారు. దానికి నా సమాధానం ఒకటే. సినిమాలే నా జీవితం కాదు. వేరే పనులు కూడా వున్నాయి. అందులో సినిమాలు ఒక భాగం మాత్రమే" అంటూ చెప్పుకొచ్చింది.      
*  మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న 'భరత్ అనే నేను' చిత్రం రిలీజ్ విషయంలో చిన్న మార్పు జరిగింది. మొదట్లో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే, ఒకరోజు ముందుగానే అంటే ఏప్రిల్ 26నే చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు తాజాగా ప్రకటించారు.
*  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాక్ష్యం' యాక్షన్ ఎంటర్ టైనర్ కి బిజినెస్ పరంగా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఈ చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ శాటిలైట్ హక్కులు 8 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
*  సుమంత్ అశ్విన్, నిహారిక హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు లక్ష్మణ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'హ్యాపీ వెడ్డింగ్' చిత్రం టీజర్ ను త్వరలో విడుదల చేస్తారు. చిత్రాన్ని వేసవి సెలవుల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
shruti
Mahesh Babu
Niharika

More Telugu News