Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తోన్న అమెజాన్‌

  • అభివృద్ధి  చెందుతున్న విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచే యోచన
  • రిటైల్‌ వ్యాపారంలో పనిచేస్తోన్న పాత ఉద్యోగులను తొలగింపుతో సద్దుబాటు
  • గతేడాది 1,30,000 మంది ఉద్యోగుల్ని చేర్చుకున్న అమెజాన్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ అమెరికాలోని తమ సీటెల్ ప్రధాన కార్యాలయంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు తెలిసింది. 2017లో ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,30,000 మంది ఉద్యోగుల్ని తీసుకుంది. అమెజాన్ డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎకో డివైజెస్‌, వీడియో, వెబ్‌ సర్వీసెస్‌ క్లౌడ్‌ బిజినెస్ వంటి విభాగాల్లో కొత్తగా ఉద్యోగుల్ని నియమించాలని ఆ కంపెనీ భావిస్తోంది.

దీంతో పలు విభాగాల్లో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెప్పింది. తమ ప్రణాళికల్లో భాగంగా ఉద్యోగుల సంఖ్యలో సద్దుబాట్లు  చేస్తున్నామని పేర్కొంది. బాగా అభివృద్ధి  చెందుతున్న విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచి, రిటైల్‌ వ్యాపారంలో ఉద్యోగుల్ని తగ్గిస్తున్నట్లు చెప్పింది.
amezon
jobs
employees

More Telugu News