టీడీపీ ఎంపీలను జోకర్లుగా అభివర్ణించిన రాంగోపాల్ వర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీడీపీ ఎంపీలను జోకర్లుగా అభివర్ణించిన రాంగోపాల్ వర్మ

  • టీడీపీ ఎంపీలపై వర్మ విసుర్లు
  • టీడీపీ ఎంపీలపై ఫేస్ బుక్ లో రెండు పోస్టులు 
  • ఎంపీలు టీడీపీ పరువు తీస్తున్నారని కామెంట్ 
   ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈసారి టీడీపీ ఎంపీలను లక్ష్యం చేసుకున్నాడు. వివిధ అంశాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసే వర్మ... పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీలను జోకర్లుగా అభివర్ణించాడు. టీడీపీ ఎంపీల ఫొటో ఒకటి పోస్టు చేసిన వర్మ...రెండు పోస్టులు పెట్టాడు.

తొలి పోస్టులో ‘ఇలాంటి జోకర్లు ఏపీ ప్రజలకు ప్రతినిధులుగా ఎన్నిక కావటం చూస్తున్న నరేంద్ర మోదీ బహుశా ఏపీని ఓ జోక్‌గా భావిస్తున్నాడేమో. వీరు జోకర్లకు తక్కువ’ అంటూ ఎద్దేవా చేశాడు. మరొక పోస్టులో ‘టీడీపీకి చెందిన వీళ్లు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం ఉన్న తెలుగు దేశం పార్టీ పరువును జాతీయ స్థాయిలో అవమానానికి గురి చేస్తున్నారు' అంటూ కామెంట్ చేశాడు.


 
ramgopal verma
rgv
comments

More Telugu News