'గాయత్రి'లో పేలిన పొలిటికల్ పంచ్ లు... ప్రత్యేక హోదాపై డైలాగ్ మాత్రం 'బీప్'!
- నేడు విడుదలైన మోహన్ బాబు 'గాయత్రి'
- పటేల్ పాత్రలో మోహన్ బాబు అద్భుత నటన
- విజిల్స్ వేయించేలా డైలాగులు
చిత్రంలో సమకాలీన రాజకీయాలపై మోహన్ బాబు నోటి నుంచి పలికించిన పొలిటికల్ డైలాగులు, రాజకీయ నాయకులపై వేసిన సెటైర్లు ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించేలా ఉన్నాయని అంటున్నారు. ప్రత్యేక హోదాపై కూడా ఓ డైలాగ్ ఉందని, అయితే, ఆ డైలాగ్ ను సెన్సార్ ఆదేశాల మేరకు మ్యూట్ చేశారని చిత్రం చూసిన అభిమానులు వెల్లడిస్తున్నారు. మొత్తం మీద సినిమాకు పాజిటివ్ స్పందన వస్తుండటంతో మంచు ఫ్యామిలీ ఖుషీగా ఉందట.